Friday, May 29, 2015

నీతి సాహస్రి... మంచి నాటకం ! మంచి సమాజం !! ... బాలల కథల పోటీ - 2015 ... ఇంకా

 కొంతకాలం క్రితం వరకూ పిల్లలకు మానసిక, వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో మార్గాలు వుండేవి. వినోదంతో బాటు విజ్ఞానాన్ని కూడా అందించే బాల,చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి లాంటి పత్రికలు అనేకం వుండేవి.
పరవస్తు చిన్నయసూరి నుంచి బాపురమణ ల వరకూ ఎందరో గత తరాల పిల్లలకి చక్కటి రచనలను అందించారు. ప్రస్తుతం విద్య వ్యాపారంగా రూపాంతరం చెందాక బాల సాహిత్యం, బాలల ఉత్సవాలు కూడా ఆర్థికంగా లాభసాటిగా వుంటేనే వెలుగు చూస్తున్నాయి.
బాలల్లో వున్న సృజనాత్మకతను తట్టి లేపి, వారి భావాలకు అక్షరరూపం కల్పించే ఉద్దేశ్యంతో శిరాకదంబం పత్రిక ' బాలల కథల పోటీ - 2015  ' తలపెట్టింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ తమ పిల్లలని ప్రోత్సహించి ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాము. వివరాల కోసం తాజా సంచిక ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 04_021

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 024

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం