Friday, August 8, 2014

వరలక్ష్మీవ్రత పుణ్యకథ... అరవిందుల సందేశము...చలువ పందిరులు.... ఇంకా చాలా.....

 ' శిరాకదంబం ' పత్రిక నాలుగవ వసంతం లోనికి అడుగు పెడుతోంది. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక విజయానికి దోహదపడిన పాఠక మిత్రులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు..... అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు.
ఆగష్టు నెల పండుగల మాసం. ఈరోజు ( 07 వ తేదీ, శుక్రవారం ) తెలుగు మహిళలకు అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతము. ఆ సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలతో .... డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచనలో గానకోకిల శ్రీమతి ఎస్. జానకి గళం నుంచి జాలువారిన ' వరలక్ష్మీ వ్రత పుణ్య కథ ' ........

తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల లాంటి పద్యములెన్నో వున్నాయి. వాటిలో మచ్చుకి కొన్నిటిని పరిచయం చేసే ' ఆణిముత్యాలు ' .........
పిల్లల ఆసక్తి కి కావల్సిన శక్తిని ఇవ్వడానికి తమ జీవితాలనే చలువ పందిరులుగా మలచుకొన్న తల్లిదండ్రుల గురించి ' చలువ పందిరులు '........

ఆగష్టు 15 వ తేదీ శ్రీఅరవిందుల జన్మదినం కూడా ! 1947 సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన భారత దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆ సందర్భంగా ఆరోజు శ్రీఅరవిందులు భారతజాతికి ఇచ్చిన అమూల్యమైన సందేశం ' 1947 ఆగష్టు 15 అరవిందుల సందేశము ' .........
ఇంకా అనేక ఇతర శీర్షికలతో.... ఈ క్రింది లింక్ లో......

శిరాకదంబం 04_001



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No.035

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం