Thursday, December 23, 2010

తెలుగు ప్రధాని

ప్రధాని పీఠమెక్కిన ఏకైక తెలుగువ్యక్తి
బహుభాషా కోవిదుడైన సాహితీ వేత్త

రాజకీయాల్లో అపర చాణక్యుడు
మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన నాయకుడు

ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి
ఆర్ధిక వ్యవస్థను ఇబ్బందుల నుండి బయిట పడేసిన మేధావి 

కష్టకాలంలో కాంగ్రెస్ ను గట్టేక్కించిన ఆపద్బాంధవుడు
కష్టాలు తీరాక కాంగ్రెస్ మరచిపోయిన తెలుగు నాయకుడు

 ఢిల్లీలో తెలుగు బావుటా ఎగురవేసిన తెలుగు తేజం
తెలుగునాట తెలుగు వారి చేత నిర్లక్ష్యానికి గురైన వైనం 

ఇది జరిగి సరిగా ఈరోజుకి ఆరేళ్ళు
ఇప్పటికైనా గుర్తిస్తారా కనీసం తెలుగు వాళ్ళయినా 

మొట్ట మొదటి, ఇప్పటివరకూ ఒకేఒక తెలుగు ప్రధానమంత్రి స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు గారి వర్థంతి సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి

Vol. No. 02 Pub. No. 093

2 comments:

Anonymous said...

ఆర్ధికసంస్కరణలకు ఆధ్యుడు , ఆయనకు నివాళి

SRRao said...

సత్యార్థి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం