Wednesday, December 15, 2010

ఇది తొలి పాట

నలభై నాలుగేళ్ళ ప్రాయం ఆ పాటకు
నూరేళ్ళ జ్ఞాపకం తెలుగు శ్రోతలకు

కోదండపాణి అందించిన బాణీ
చేసింది పాటలలో వైవిధ్యానికి బోణీ 

ఒక కొత్త స్వరం... ఒక కొత్త ఊపు తెలుగు పాటకి
ఒక కొత్త అనుభూతి... ఒక కొత్త అనుభవం తెలుగు శ్రోతకి

అప్పటినుంచి ఇప్పటిదాకా అదే గళం
వినిపిస్తోంది మధురగీతాల్ని అదే స్వరం

1966 వ సంవత్సరంలో ప్రముఖ సంగీత దర్శకులు ఎస్. పి. కోదండపాణి గారు పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

బాలు స్థానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో బాటు ఎస్. పి. కోదండపాణి గారి కృషి కూడా చాలా ఎక్కువగా పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతంలో పరిచయం చేయడంతో బాటు చిత్ర రంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి, అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి గారే అడిగేవారట. బాలు గారికి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీతదర్శకుల దగ్గర బాలు గారు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్ళి వినేవారట. పాటలో పొరబాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపేవారట.
 
బాలు గారి భవిష్యత్తుకు ఎంత ఆరాట పడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి గారు. ఒకసారి బాలు గారు కష్టబడి సైకిల్ తొక్కుకుంటూ కోడంబాక్కం వంతెన మీద వెడుతుంటే అప్పుడే కారు మీద వెడుతున్న కోదండపాణి గారు చూసారు. బాలు గారిని ఆపి " ఏమిటయ్యా పంతులూ ! ఈ ఎండలో సైకిల్ మీద విహారం ఏమిటీ ? బుద్ధిలేదూ ? ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది. బస్సులో వెళ్ళు. ఇకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను " అని మందలించారట. ఆయన శ్రద్ధ, కోరిక ఫలించి తెలుగు వారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు.
 
బహుముఖ పజ్ఞాశాలిగా ఎదిగిన బాలు గారు నలభై నాలుగు సంవత్సరాల క్రితం తొలి పాట పాడిన రోజు.... ఈరోజు.....
ఆ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాట ఇక్కడ ..............
 


Vol. No. 02 Pub. No. 083

5 comments:

Dr.Suryanarayana Vulimiri said...

రావు గారు. చక్కగా గుర్తు చేసారు. ఇది ఎస్.పి. పాడిన తొలిపాట-"ఏమి ఈ వింతమోహం". పద్మనాభం గారి స్వంత చిత్రం శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న నుండి. 1967 అనుకుంటాను. ఈ పాటకు సహగాయనీ గాయకులు -పి.సుశీల, కె.రఘురామయ్య,పి.బి.శ్రీనివాస్.

Vinay Datta said...

Good to celebrate the 44th annual day of a song.

SRRao said...

* సూర్యనారాయణ గారూ !
1966 వ సంవత్సరం అండీ ! ధన్యవాదాలు.

* మాధురి గారూ !
ధన్యవాదాలు

Telugu Movie News said...

great sp balasubramanyam garu

SRRao said...

ధన్యవాదాలు Telugu Movie News

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం